బొండా ఉమా  దంపతులతో సహా 9 మందిపై చర్యలు: హైకోర్టు ఆదేశాలు

Bonda Uma, 9 other acts including: High Court orders

Bonda Uma, 9 other acts including: High Court ordersBonda Uma, 9 other acts including: High Court orders

Date:17/10/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్‌రావు దంపతులు సహా9 మందిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధితుడి పిటిషన్‌ను విచారించిన కోర్టు.. బొండా ఉమా దంపతులతో పాటు 9 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసులను కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ భూమికి సంబంధించి.. బొండా ఉమా తనను బెదిరిస్తున్నారని రామినేని కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని బాధితుడు వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోటేశ్వర్‌రావు హైకోర్టును ఆశ్రయించాడు.
Tags:Bonda Uma, 9 other acts including: High Court orders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *