వారసుడితో బోనీ డ్యాన్స్ …స్టోరీ 

Bonnie Dancing with the Heir ... Story

Bonnie Dancing with the Heir ... Story

Date:27/02/2018
ముంబై ముచ్చట్లు:
అందాల నటి శ్రీదేవి మృతిపై సందిగ్ధత వీడటం లేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం బాత్‌టబ్‌లో ఊపిరాడకే ఆమె చనిపోయారని వెల్లడైంది. అయితే.. కుటుంబ సభ్యులు తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లు చెప్పడం ఇప్పుడు అనేక అనుమానాలకి తావిస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి ప్రమాదానికి గురైన సమయంలో ఆమె భర్త బోనీకపూర్ అక్కడే ఉండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి అతనిపై నిలిచింది. దుబాయ్‌లో తమ బంధువైన మోహిత్ మార్వా వివాహ వేడుక కోసం బోనీకపూర్, శ్రీదేవి, చిన్న కూతురు ఖుషీ వెళ్లగా.. అక్కడ బోనీ చర్యలు శ్రీదేవికి పట్టరానంత కోపం తెప్పించాయని వార్తలు వస్తున్నాయి.బోనీ కపూర్ మొదటి భార్య మోనా సమీప బంధువే మోహిత్ మార్వా కావడంతో ఆమె తరఫు బంధువులు కూడా ఈ వేడుకకి వచ్చారు. దీంతో బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలైన అర్జున్ కపూర్, అన్షూలతో వివాహ వేడుకలో సందడిగా తిరిగి.. డ్యాన్స్‌ కూడా చేశాడట. ఇది చూసిన శ్రీదేవికి చిర్రెత్తికొచ్చేసిందని.. వేడుకలోనే భర్తని ‘వారితో మళ్లీ ఎందుకు చనువుగా ఉంటున్నావ్..?’ అంటూ ప్రశ్నించినట్లు సమాచారం.1996లో బోనీకపూర్‌ని పెళ్లి చేసుకునే సమయంలో మొదటి భార్య మోనాతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని శ్రీదేవి షరతు పెట్టింది. దీనికి అప్పట్లో ఒప్పుకున్న బోనీకపూర్.. క్రమంగా మోనా, ఆమె పిల్లలకి దగ్గరవుతూ వచ్చాడు. దీంతో.. శ్రీదేవిలో ఆందోళన మొదలైంది. అయితే 2012లో బోనీకపూర్ మొదటి భార్య చనిపోగా.. ఇప్పుడు మళ్లీ బోనీ ఆమె పిల్లలతో చనువుగా మెలగడం శ్రీదేవికి ఇష్టం లేకపోయింది. ఆస్తిలో కూడా సగం వారికి ఇవ్వాల్సి వస్తే..? తన పిల్లల పరిస్థితి ఏంటనే ఆందోళన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసిందట. దీంతో పెళ్లి వేడుక ముగిసినా.. భర్తతో కలిసి భారత్‌కి వెళ్లకుండా అక్కడే ఉండిపోయి తీవ్ర ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వేడుకలో శ్రీదేవి డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో వచ్చిన బోనీకపూర్ ఆమె‌కి సాంత్వనం కలిగించేరీతిలో కౌగలించుకోవడం వెనుక కారణం ఇదేనని తెలుస్తోంది. వేడుక ముగిసిన తర్వాత కూడా దుబాయ్‌లోనే ఉన్న శ్రీదేవి ఫోన్‌లో భర్తతో వాగ్వాదానికి దిగడంతో మళ్లీ బోనీకపూర్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
Tags: Bonnie Dancing with the Heir … Story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *