Natyam ad

సర్కార్ ఆస్పత్రికి  సుస్తీ

నిజామాబాద్ ముచ్చట్లు:

ఉత్తర తెలంగాణలో సర్కారు ఉచిత వైద్యానికి కేరాఫ్‌గా ఉన్న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్కానింగ్ రిపేర్‌కు వచ్చింది. కోట్ల రూపాయల విలువైన స్కానింగ్ యంత్రం పనిచేయక రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. స్కానింగ్ లేకపోవడంతో వైద్యులకు కూడా రోగికి, క్షతగాత్రులకు వైద్యం చేయాలంటే రిపోర్టులు లేక తిప్పలు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితిలో స్కానింగ్ తియాలంటే ప్రైవేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గత నెల రోజులుగా నిజామాబాద్ ప్రభుత్వ వైధ్య కళాశాల అనుబంధ జిజిహెచ్‌లో స్కానింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. నిజామాబాద్ సర్కారు దవాఖానాల్లో స్కానింగ్ పని చేయకపోవడం వలన పేదలను ధర్మాసుపత్రిలో వైద్యం అంటే పట్నంకు రిఫర్ చేస్తున్నారు వైద్యులు. ఆరోగ్యశ్రీ ఉన్న వాటిని మాత్రం ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు.ఏడంతస్తుల జిల్లా జనరల్ ఆస్పత్రిలో 750 పడకలు ఉండగా.. ఇటీవల రికార్డు స్థాయిలో 1,000 కి పైగా ఇన్ పెషేంట్‌లుగా సేవలందించిన రికార్డును దక్కించుకుంది. రాష్ర్టంలో ఎక్కడ లేని విధంగా సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందిస్తున్న జిజిహెచ్‌లో స్కానింగ్ లోటు కోట్టోచ్చినట్లు కనపడుతుంది. నిత్యం 1,500 నుంచి 2,000 మంది రోగులు ఔట్ పెషేంట్‌లుగా వచ్చే ఆసుపత్రికి ఖరిదైన స్కానింగ్ సేవలు లేకపోవడంతో చాలమంది జిజిహెచ్‌కు తగ్గిపోయారు. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యం అందడం గగనంగా మారింది. ట్రామా కేసులను ఆరోగ్య శ్రీ ఉన్న ఆసుపత్రులకు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

 

 

నిజామాబాద్ జిజిహెచ్‌లో వైద్యం కోసం అవసరమైన స్కానింగ్ లేకపోవడంతో పేదలను గాంధీ, ఉస్మానియా కి తరలిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు నిర్మల్, నాందేడ్ ప్రజలు సైతం నమ్మకంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే, తొలుత రోగ నిర్ధారణ చేసే రేడియాలజీ సేవలకు కారణమైన స్కానింగ్ లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.2,000 నుంచి ప్రారంభమై 6 వేల వరకు ఖరీదైన స్కానింగ్ సేవలు అందకపోవడం తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెట్టింది.నిజామాబాద్ జిజిహెచ్‌లో అత్యవసర సేవలకు అందుబాటులో ఉండాల్సిన స్కానింగ్ సేవలు అందకపోగా కనీసం టెక్నిషియన్‌ల సేవలు అందడం లేదు. జిజిహెచ్‌లో పనిచేస్తున్న టెక్నిషియన్‌లు ఒక ప్రైవేట్ స్కానింగ్ సేంటర్‌ను గుత్త పట్టుకుని సేవలందిస్తున్నారు .

 

 

 

Post Midle

అనే ఆరోపణలు ఉన్నాయి. సాధరణ సమయంలోనే జిజిహెచ్ కంటే ప్రైవేట్ స్కానింగ్ సేంటర్‌లో ఉండి పనిచేస్తున్న వారిని అన్ కాల్ పేరిట పిలిపించి సేవలందిస్తున్నారు అనే విమర్శలు లేకపోలేదు. జిజిహెచ్‌లో 24 గంటల వైధ్య సేవలను అందించే చోట స్కానింగ్ లేకపోవడంతో ఇక్కడ పనిచేసే టెక్నిషియన్‌లు జిజిహెచ్‌లో పనిచేస్తూ ప్రైవేట్ ప్రాక్టిస్ సేవలలో నిమగ్నమయ్యారు.సిటి స్కానింగ్ మరమ్మత్తులు కావడం ఒకింత ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్న జిజిహెచ్ వైద్యులకు వరంగా మారింది. జిజిహెచ్‌లోని రోగులు స్కానింగ్ సేవలకు వేళ్లిన వారికి అక్కడ పనిచేస్తున్న వారు తక్కువ ఫీజు వైద్యం పేరిట రిఫర్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయంలో కొందరికి కవర్లు(మామూలు) ముట్ట చెబుతున్నారని జిజిహెచ్ అంతా కోడై కూస్తోంది. జిజిహెచ్ అధికారులు మాత్రం నెలరోజులు గడిచిన మరమ్మత్తులు చేయిస్తున్నామని చెబుతున్న అవి పూర్తయ్యేది ఎన్నడో పేదలకు ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చేదెన్నడు అనే విషయం పాలక మండలికి సైతం పట్టింపులేని విధంగా మారింది.

 

Tags: Boredom for Sarkar Hospital

Post Midle