బోరు బావిలో పడిన బాలుడు
యువకుడి సాహాసంతో బయటపడిన వైనం
ఏలూరు ముచ్చట్లు:
బోరు బావిలో పడిన బాలుడిని ఒక యువకుడు సాహసం చేసి రక్షించాడు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంటలో ఈ ఘటన జరిగింది. తొమ్మిది సంవత్సరాల జస్వంత్ 30 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. విషయం తెలిసిన సురేష్ అనే యువకుడు నడుముకి తాడు కట్టుకుని బోరుబావిలోకి దిగి జస్వంత్ ను పట్టుకుని తాడు కట్టాడు. పైనున్న స్థానికులు తాడును పైకి లాగి బాలుడిని కాపాడారు. చివరకు బాలుడు బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడడంలో అందరూ ఊపరి పీల్చుకున్నారు.
Tags: Boru is a boy who fell into a well