బోస్టన్ కమిటి నివేదిక సబ్ మిట్

Date:04/01/2020

తాడేపల్లి ముచ్చట్లు:

బోస్టన్ కమిటి రాష్ట్ర సమగ్ర అభివృధ్ది కి సంబంధించి కొన్ని అంశాలను బేస్ చేసుకుని ముఖ్యమంత్రి జగన్ కి నివేదిక సబ్ మిట్ చేసింది.దానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఆరుప్రాంతాలుగా విభజించి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు గాని, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సమగ్ర నివేదికను అందచేశారు. ఇందులో ప్రధానంగా గతంలో శ్రీ కృష్ణకమిటి రిపోర్ట్ ఇచ్చినా, శివరామకృష్ణకమిటి నివేదిక, జిఎన్ రావు కమిటి నివేదిక ఇచ్చినా చెప్పిన అంశాలనే వారు కూడా ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ అన్నారు.  రాష్ట్ర విభజన సమయంలో వేసిన శ్రీకృష్ణకమిటి ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలు,రాయలసీమకు చెందిన నాలుగుజిల్లాలు ఈ ఏడు జిల్లాలు వెనకబాటు తనానికి గురైన జిల్లాలుగా గతంనుంచి కమిటిలు రిపోర్ట్ లు ఇస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాలు ఏ రకంగా వెనకబడి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాయలసీమకు తాగు,సాగునీరు ఎంత అవసరమో వారు చెప్పారు.ఉత్తరాంధ్రకు చెందిన తాగు,సాగునీటి అవసరాలు కూడా చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నిరక్ష్యరాస్యత,ఫిషరీష్ అభివృద్ది లాంటి ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించారు.ప్రపంచంలోని గ్రీన్ ఫీల్డ్ సిటీల ప్రయోగాలు ఏ రకమైన ఇబ్బందులకు గురయ్యాయనేది ప్రస్తావించారు.రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రాజెక్ట్ లు, కెనాల్స్ విస్తరణ లాంటి అనేక విషయాలను వారు పరిగణనలోనికి తీసుకున్నారు. ఇప్పటికే రెండున్నరలక్షల అప్పులు ప్రభుత్వంపై నెట్టేసి ఉన్న స్దితిలో తిరిగి కొత్త రాజధానిపై లక్షకోట్లు పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడే ప్రయోగం మంచిది కాదని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసి ఏ విధంగా నష్టపోయాయో చెప్పారు.
ఈ రోజు ఏ రాజధాని అయినా ఏ నగరమైనా అది ప్రజల వల్ల అభివృధ్ది చెందాలి, నగరం అవ్వాలే తప్ప ప్రభుత్వమే నగరంగా అభివృద్ది చేయడమనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్.ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా ఫెయిలైన 50 నగరాలను ప్రస్తావించారు.ఉదాహరణలు చెప్పారని అయన అన్నారు. అలాంటి పరిస్దితులలో విశాఖ,కర్నూలు,అమరావతి మూడురా«జధానులుగా బాగుంటాయని ప్రతిపాదనలుగా వారు కూడా చేశారు.ఈ రాష్ట్ర సమగ్ర అభివృధ్దికి,13 జిల్లాల ప్రజల ఆకాంక్షలకు,ఆ ప్రాంతాలలో ఉన్న వనరులను బట్టి ఆ ప్రాంతాల అభివృద్దికి ఇచ్చిన రిపోర్ట్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది.  కొన్ని పత్రికలలో చూశాం.మూడు ముక్కలు అని ప్ర«ధానంగా ప్రస్తావించాయి.ఈరోజు ఎందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఆలోచనను ప్రజలకు కలిగించే ప్రయత్నం వారు చేస్తున్నారు.వారి ఉద్దేశ్యం ఏంటి.ఒక రాజధాని ఉంటే మరో రాజధాని కట్టుకుంటే తప్పేముందనే భావన ప్రజలకు కలుగుతుంది. 13 జిల్లాలు సమానంగా అభివృద్ది చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి జగన్ గారు ఉంటే వారు ఎందుకు ఆ రకమైన విషప్రచారం చేస్తున్నారు.అనేది ఆలోచన చేయాలి.ఎప్పుడో నాగార్జున సాగర్ డ్యామ్ ను 1955 లో నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత శ్రీశైలం కట్టారు.ఇప్పుడు తాజాగా గోదావరిపై పోలవరం కడుతున్నారు.ఒక దగ్గర కట్టినంతమాత్రాన మరోచోట అభివృద్ది చేయకూడదనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నారో అర్దం కావడంలేదని అయన అన్నారు.

 

లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకలు

 

Tags:Boston Committee Report Subm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *