కాంగ్రెస్ లోకి బైరెడ్డి

Bounded into Congress
Date:21/07/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే దేశానికి కాబోయే ప్రధాని అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం రాహుల్ గాంధీ సమక్షంలో బైరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని.. కేవలం 13 జిల్లాలకే పరిమితమైన పార్టీలు ఏమి చేయలేవని అన్నారు. ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని బైరెడ్డి అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కై తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని బైరెడ్డి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి 50 సీట్లకు మించి రావని ఆయన తెలిపారు. కాంగ్రెస్ వైపే దేశ ప్రజలు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో యువరాజు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని బైరెడ్డి తెలిపారు. కర్నూల్‌ జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. 1994 వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అనంతరం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2009 వరకు అదే పార్టీలో కొనసాగారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి రాయలసీమ హక్కుల కోసం ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ని ప్రారంభించిన విషయం తెల్సిందే. కొద్దిరోజుల క్రితం ఊమెన్ చాందీతో బైరెడ్డి భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డితోనూ బైరెడ్డి మంతనాలు జరిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తర్వాత రాయలసీమ నుంచి కాంగ్రెస్‌లోకి పునరాగమనం చేసిన రెండో నేతగా బైరెడ్డి నిలిచారు.
 కాంగ్రెస్ లోకి బైరెడ్డి https://www.telugumuchatlu.com/bounded-into-congress/
Tags:Bounded into Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *