శైలజారెడ్డిపై బాక్సాఫీసు ఆశలు

Box office hopes on Shailaja Reddy

Box office hopes on Shailaja Reddy

Date:11/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఈ శుక్రవారం విడుదల కానున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ టార్గెట్టే ఉన్నట్టుగా తెలుస్తోంది. మినిమం ఎంటర్ టైన్ ‌మెంట్ గ్యారెంటీ అనే భరోసాను ఇస్తోంది ఈ సినిమా. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, సాంగ్స్.. ఈ సినిమా పై పాజిటివ్ అంచనాలను పెంచాయి. అందులోనూ టాలీవుడ్‌కు అత్తా- అల్లుడి ఎంటర్‌టైన్ మెంట్ సక్సెస్ ఫుల్ ఫార్ములా.
ఈ నేపథ్యంలో.. ‘శైలజారెడ్డి అల్లుడు’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జరిగిందట ప్రీ రిలీజ్ బిజినెస్. ఈ సినిమా థియేటరికల్ రైట్స్ దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగచైతన్య ఇది వరకటి హిట్ సినిమాలు 22 నుంచి 27 కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ హీరో తాజా సినిమా 25 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసినట్టుగా తెలుస్తోంది.
అందులోనూ ఈ సినిమాకు దర్శకుడు మారుతి. యంగ్ హీరోలతో ఇది వరకూ కూడా హిట్స్ కొట్టాడు ఈ దర్శకుడు. ఈ నేపథ్యంలో వీరి కాంబో సినిమా పై డిస్ట్రిబ్యూటర్లు బాగానే ఇన్వెస్ట్ చేశారు. కనీసం 25 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాబడితే హిట్ అని చెప్పవచ్చు. 40 కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను గనుక సాధిస్తే.. ‘శైలజారెడ్డి అల్లుడు’ బ్లాక్ బస్టర్ అవుతుంది.
Tags:Box office hopes on Shailaja Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *