Natyam ad

హాస్టల్ లో బాలుడి మృతి

కామారెడ్డి ముచ్చట్లు: 


బీర్కుర్ బిసి హాస్టల్ లో విద్యార్థి మృతి కలకలం రేపింది. నసూర్లాబాద్ మండలం దుర్కికి గ్రామానికి చెందిన సాయి రాజ్ హాస్టల్ లో ఐదవ  తరగతి చదువుతున్నాడు. సాయి రాజ్ ను పాము కాటు వేసిందని వార్డెన్ అంటున్నాడు. అయితే, బాలుడి తల్లిదండ్రులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బంధువులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు.
ఘటనపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు, బీర్కూర్ బీసీ బాలుర వసతిగృహం వార్డెన్ సందీప్ ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మృతిచెందినందున అతడిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విద్యార్థి మృతి పై ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని పేర్కొన్నారు.

 

Tags: Boy dies in hostel

Post Midle
Post Midle