సంపులో బాలుడు మృతి … తల్లే ముద్దాయి
గాజువాక ముచ్చట్లు:
ఈనెల 28 న జరిగిన సంపులో బాలుడి మృతి కేసులో తల్లే నిందితురాలని పోలీసులు తేల్చారు. ఎస్ ఐ టి. రవికుమార్ , టీం హైదరాబాద్ వెళ్ళి ముద్దాయిలను పట్టుకున్నారు. ఈ మేరకు గాజువాక పోలీస్
స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పంతులుగారి మేడవద్ద ఘటన జరిగింది. … అక్రమ సంబంధమే కొడుకుని చంపడానికి కారణమని సిఐ లంక్ భాస్కర్ వెల్లడించారు. దూది దొరబాబు, దూది
మణిలకు ఇద్దరు బాబులు. నిందితురాలికి కాకినాడకు చెందిన పనస కుమార్ తో అక్రమ సంబంధం ఏర్పడింది. చిన్నకొడుకు వేదింత్ అడ్డంకిగా వున్నాడనే కోపంతో సంపులో తోసేసినట్టు విచారణలో తల్లి
వెల్లడించింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సిఐ లంక భాస్కర్ చెప్పారు.

Tags:Boy dies in Sampu … father accused
