Boy killed in road accident

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Date:22/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పొలం పనుల నుంచి ఇంటికి టివిఎస్‌పై వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో బాలుడు మృతి చెందగా మరోక వ్యక్తి గాయపడిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని అప్పిగానిపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకట్రమణ కుమారుడు ఈశ్వర్‌ (11) , అశోక్‌ అనే వ్యక్తి కలసి ఇద్దరు టివిఎస్‌లో పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుకవైపు నుంచి రామసముద్రం మండలం గొల్లపల్లెకు చెందిన సయ్యద్‌బాషా అతివేగంగా వచ్చి టివిఎస్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అశోక్‌ , ఈశ్వర్‌ గాయపడ్డారు. గాయపడిన ఇరువురిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తెలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈశ్వర్‌ మృతి చెందాడు. ఏకైక కుమారుడు మృతి చెందడంతో వెంకట్రమణ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

వైభవంగా పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Boy killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *