భక్తులతో కిటకిటలాడినబోయకొండ

– క్రిక్కిరిసినక్యూలైన్లు
-ప్రత్యేక అలంకారంలో అమ్మవారు
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
గంగమ్మ తలీ్ల మా కోర్కెలు తీర్చి మమ్మల్ని చల్లగా ఉండేలా ఆశీర్వదించమ్మా…అంటూ భక్తులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆదివారం వెహోక్కులు చెల్లించారు. శెలవు దినం కావడంతో యువకులు, ఉద్యోగులు బోయకొండ కు తరలిరావడంతో ఆలయంలో రద్దీతో గణనీయంగా పెరిగింది. ఎటు చూసిన జనంతో కొండ ప్రాంతం కిటకిటలాడింది. ఆలయంలోని క్యూలైన్లు అన్నీ క్రిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధవాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.కోరిన కోర్కెలు తీరిన భక్తులు ౖపిండి,నూనెదీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెహోక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి , పాలకమండళి సభ్యులు వెంకటరమణారెడ్డి, ఈశ్వరమ్మల పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Boyakonda chattering with devotees

Natyam ad