భక్తులతో పోటేత్తిన బోయకొండ
చౌడేపల్లి ముచ్చట్లు:
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు లెక్క ప్రకారం సుమారు 50 వేల మంది వరకు అమ్మవారు దర్శించుకున్నట్లు సమాచారం.వేకువజామున 5 గంటల నుంచి భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగింది. పాలకమండలి అధ్యక్షుడు నాగరాజరెడ్డి ,వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఈవో చంద్రమౌళిలు ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన పూలు, నిమ్మకాయలు, కుంకుమ, తీర్థ ప్రసాదాలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు.భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో ఇంకనూ చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు భాస్కర్ రెడ్డి, పవన్ కోఆఫ్సన్ సభ్యుడు గంగిరెడ్డి వైసిపి నాయకులు మల్లికార్జున రెడ్డి ఇమ్రాన్, గంగిరెడ్డి, డిష్ సూరి టెంపుల్ ఇన్పెక్టర్లు సురేంద్ర రెడ్డి, కృష్ణా రెడ్డి, వీరకుమార్ అర్చకులు గంగిరెడ్డి, సుధాకర్, హరి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags: Boyakonda crowded with devotees
