Boyakonda Gangamma as Mahishasuramarthini, the enemy slayer

శత్రు సంహారి మహిషాసురమర్థిని గా బోయకొండ గంగమ్మ

Date:22/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

శత్రు సంహారి మహిషాసుర మర్థిని అలంకరణలో బోయకొండ గంగమ్మ గురువారం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మ తల్లిగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మను దసరా మహ్గత్సావాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా ముస్తాబుచేశారు. ఆలయంలో ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం మంగళ హారతులతో అమ్మవారిని మేల్కొల్పి మేళతాళాలనడుమ అర్చకులు గంగమ్మ తల్లికు పూజలు నిర్వహించారు. వేదపండితులు లక్ష్మణాచార్యులు,గోవర్ధనశర్మ తదితర అర్చక బృందం ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద మంత్రోచ్చారణల మద్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదారులచే గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, ఊంజల్‌సేవ, గణపతిహ్గమం, చంఢీహ్గమంతో పాటు పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

నేడు మహాల క్ష్మిదేవి గా అమ్మవారు…….

దసరా మహ్గత్సవాల్లోభాగంగా ఏడవరోజైన శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మిదేవి ఆలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నట్లు ఈఓ చంద్రమౌళి తెలిపారు.

సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలి

Tags:Boyakonda Gangamma as Mahishasuramarthini, the enemy slayer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *