Boyakonda Gangamma as Rajarajeshwaridevi

రాజరాజేశ్వరీదేవి గా బోయకొండ గంగమ్మ

Date:26/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

కోరిన కోర్కెలు తీర్చే ఆరాధదైవంగా పేరొందిన బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవ రాత్రులలో భాగంగా అమ్మవారిని చివరి రోజైన ఆదివారం శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో అమ్మవారిని పట్టుపీతాంబరాలు, రంగురంగుల పుష్పమాలికలు, బంగారు ఆభరణాలతో శ్రీరాజరాజేశ్వరిదేవి అలంకరణలో కొలువుతీర్చారు.ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి వేదపండితులు గోవర్థనశర్మ,లక్ష్మణాచార్యుల మంత్రోచ్చారణలమద్య అమ్మవారికి గణపతి పూజ,స్వస్తివాచనం,దేవనాంది,అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, గణపతిహ్గమం, చంఢీహ్గమం లతో పాటు పూర్ణాహుతి చేశారు. పూజా కార్యక్రమాల తరువాత అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

Tags: Boyakonda Gangamma as Rajarajeshwaridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *