Natyam ad

ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ

– భక్తిశ్రధ్దలతో హోమ పూజలు
– మొక్కులు చెల్లించి పూజలుచేసిన భక్తులు

చౌడేపల్లె ముచ్చట్లు:


పుణ్యక్షేత్రమైనశ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవరోజైన సోమవారం అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తుల పాలిట కొంగుబంగారమై విరజల్లుతున్న బోయకొండలో ఉత్సవమూర్తులకు అర్చకులు ఉదయం అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టుపీతాంబరాలు ,పరిమళభరిత పుష్పమాలికలు ,విశేషాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితులు గోవర్థనశర్మ, తదితర అర్చక బృందం ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద మంత్రోచ్చారణల మద్య అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన దుర్గ, శివకుమార్‌ దంపతులు, గుణనేత్ర, గురుప్రసాద్‌లు బెలగులికి చెందిన వెంకటమ్మ, చిక్క మునిశెట్టి , పెద్దపంజాణి మండల ట్రాన్స్కో ఏఈ నాగలక్ష్మి, వెంకటరమణ దంపతులు తదితరులు వ్యవహరించారు. వారిని ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజరెడ్డి, ఇఓ చంద్రమౌళి సిబ్బంది స్వాగతించి , వారిచే గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, ఊంజల్‌సేవ, గణపతిహోమం, చంఢీహ్గమంతో పాటు పూర్ణాహుతి చేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులుఅధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రూజలు చేసి వెహోక్కులు చెల్లించారు.

Post Midle

నేడు మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు…….

దసరా మహోత్సవాల్లోభాగంగా మూడవ రోజైన మంగళవారం అమ్మవారు మహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనబాగ్యం కల్పించనున్నట్లు ఈవో చంద్రమౌళి తెలిపారు.

 

Tags: Boyakonda Gangamma in Adishakti Parvati’s adornment

Post Midle