Natyam ad

శాకాంబరీదేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ

–విశేష పూజలందుకొన్న గంగమ్మ
–కూరగాయలతో అలంకరణ
— వెహోక్కులు చెల్లించిన భక్తులు

చౌడేపల్లె ముచ్చట్లు:


పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహ్గత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం అమ్మవారు శాకాంబరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవళ్లి గా , భక్తుల పాలిట కొంగుబంగారమై అమ్మవారు ప్రసిద్దికెక్కారు. వేకువ జామున నుంచి అమ్మవారి గర్బాలయంను శుద్దిచేసి మామిడి , వేపాకు తోరణాలతోపాటు అరటి చెట్లుతో ముస్తాబుచేశారు.బోయకొండలో ఉత్సవమూర్తులకు అర్చకులు ఉదయం అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టుపీతాంబరాలు ,పరిమళభరిత పు రంగు రంగుల పుష్పమాలికలు ,విశేషాభరణాలతో పాటు కూరగాలయతో శాకాంబరి దేవిగా కొలువు తీర్చారు. వేదపండితులు గోవర్థనశర్మ,గంగిరెడ్డి, తదితర అర్చక బృందం ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి ల తోపాటు ఉభయదారులుచే అమ్మవారికి ప్రత్యేక హ్గమ పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా చౌడేపల్లె మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌,పద్మావతి దంపతులు, కలికిరి కూరగాయల ధాత లక్ష్మి, శ్రీనివాసులు దంపతులు, తిరుపతి జ్యోతమ్మ,పుంగనూరు వరలక్ష్మి, శ్రీనివాసులు దంపతులు,ముళబాగిల్‌ విద్యావతి, హనుమప్ప దంపతులు, బెంగళూరు కోమల, నారాయణస్వామి దంపతులు వ్యవహరించారు. వీరికి తీర్థప్రసాదాలను అందజేశారు.

 

Post Midle

నేడు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు…….
దసరా మహ్గత్సవాల్లోభాగంగా ఆరవ రోజైన ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనబాగ్యం కల్పించనున్నట్లు ఈవో చంద్రమౌళి తెలిపారు.

Tags: Boyakonda Gangamma in Sakambaridevi Alankaram

Post Midle