బోయకొండ గంగమ్మ తల్లి దీవెనలకోసం తరలివచ్చిన జనం

– ఆషాడమాసం రాకతో పెరిగిన రద్దీ
– కిటకిటలాడిన బోయకొండ
– ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

బోయకొండ గంగమ్మతల్లి దీవెనలకోసం భక్తులు బోయకొండ కు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆషాడమాసం రాకతో గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ క్రిక్కిరిసిపోయాయి. బోయకొండలో ఎటుచూసినా జన సంధ్రంగామారింది.ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధవాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లులో భక్తులు మాస్కులతో పాటు కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ కోరిన కోర్కెలు తీరిన భక్తులు ౖపిండి,నూనెదీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెహోక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు..సీఐ మధుసూదనరెడ్డి ్య ధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Boyakonda Gangamma is the people who came for the blessings of the mother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *