బోయకొండ హుండీ రాబడి రూ:37.99 ల క్షలు

చౌడేపల్లె ముచ్చట్లు:


పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా రూ:37.99 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ తెలిపారు. హుండీలో భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 37,99,178 రూపాయలు, బంగారం 22గ్రాములు, వెండి 520 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు యుఎస్‌, మలేౖషియా, విదేశీ కరెన్సీ 4నోట్లు వచ్చాయన్నారు. ఈ ఆదాయం 48రోజులకు వచ్చినట్లు ఈఓ చంద్రమౌళి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకమండళి సభ్యులు పూర్ణిమ,శ్రావణి, ఎక్స్అఫిషియో మెంబరు గంగిరెడ్డి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, ఆలయ ,బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Boyakonda hundi revenue is Rs: 37.99 lakhs

Leave A Reply

Your email address will not be published.