బోయకొండ హుండీ రాబడి రూ:68.07 ల క్షలు
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా రూ:68.07 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ తెలిపారు. హుండీలో భక్తుల సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ. 68,070,24000 రూపాయలు, బంగారం 69గ్రాములు, వెండి 348 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ 12 నోట్లు నాణెలు వచ్చాయన్నారు. ఈ ఆదాయం 35రోజులకు వచ్చినట్లు ఈఓ చంద్రమౌళి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకమండళి సభ్యులు పూర్ణిమ,శ్రావణి, ఆలయ ,బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Boyakonda hundi revenue is Rs: 68.07 lakhs

