కొత్త హంగులను సంతరించుకున్న బోయకొండ.

-పనులను పరిశీలించిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి.

-పుష్కరిణీ , పూల మొక్కల పార్క్ పనులు ప్రారంభం.

– త్వరగా పనులు పూర్తి చేయాలి.

 

చౌడేపల్లి ముచ్చట్లు:

 

జిల్లాలో నాల్గవ పుణ్య క్షేత్రం గా విరాజిల్లు తున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో కోట్లాది రూపాయల నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శుక్రవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పరిశీలించారు.ఈ పనులు ముగింపు దశ లకు చేరువ లో ఉండడంతో బోయకొండ కు కొత్త హంగులు సంత రించుకో నుంది.మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు ఆలయం వద్ద లడ్డు పోటు,కొండ కింద నుంచి ఆలయం వద్దకు సిమెంట్ రోడ్లు,కొత్త హంగుల తో ఆకర్షణీయంగా పుష్కరిణీ ఏర్పాటు,ప్రహరీ గోడలు,భక్తులకు మౌలిక సదుపాయాలు,ఆలయం వద్ద అత్యంత ఆకర్షణీయంగా పార్క్ తదితర అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి.భక్తులకు దర్శనం, అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు,ఆర్జిత చేసుకొనే సదుపాయం కల్పించారు .పనులను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను పెద్దిరెడ్డి ఆదేశించారు.పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, ఈ ఓ చంద్రమౌళి, సోమల కె. మల్లికార్జున రెడ్డి,డ్వామా పీడీ శ్రీనివాసులు, ఏపీ ఓ శ్రీనివాసులు యాదవ్, విఆర్వో నారాయణ,నేతలు లడ్డు రమణ,నవీన్, శ్రీనాథ్,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Boyakonda is a place where new things are celebrated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *