భక్తుల రద్దితో కిటకిటలాడిన బోయకొండ
–క్రిక్కిరిసిన క్యూలైన్లు
— మొక్కులు చెల్లించిన భక్తులు
— పోలీసు నిఘా నీడలో దర్శనం
చౌడేపల్లె ముచ్చట్లు:

కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట వరాలిచ్చే ఆరాధ దైవంగా పేరొందిన బోయకొండ గంగమ్మ ఆలయం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కోర్కెలు తీరిన భక్తులు అధిక సంఖ్యలో బోయకొండకు చేరకొని అమ్మవారికి పూజలు చేశారు. గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీతో ఒక్కసారిగా గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ క్రిక్కిరిసిపోయాయి.ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసంవివిధవాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.కోరిన కోర్కెలు తీరిన భక్తులు ౖపిండి,నూనెదీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ చైర్మన్ శంకర్‌నారాయణ, ఇఓ చంద్రమౌళిల పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరుగకుండా పోలీసులు న్యిఘాలో భక్తులకు దర్శనం కల్పించారు.
Tags: Boyakonda is crowded with devotees
