భక్తులతో కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్త్రలనుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని అత్యంత సుంధరంగా ముస్తాబుచేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నైవేద్యంతోపాటు జంతు బలులిచ్చి వెహోక్కులు చెల్లించారు.ఆలయం వద్ద ఎటు చూసిన భక్తుల రద్దీతో జనసంద్రంగా మారింది. భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ మిద్దెంటి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ఉచిత తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags: Boyakonda is crowded with devotees
