భక్తులతో కిటకిటలాడిన బోయకొండ
— రద్దీతో క్రిక్కిరిసిన క్యూలైన్లు
— ప్రత్యేక అలంకారంలో గంగమ్మ
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం లో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రా లనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి విశిష్ట పూజలు చేశారు. ఉదయం నుంచి సాయత్రం వరకు రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎగబడ్డారు. ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Tags: Boyakonda is crowded with devotees
