పుంగనూరులో గురుపూజోత్సవ కార్యక్రమాలను బహిష్కరణ
పుంగనూరు ముచ్చట్లు:
స్థానిక MRC కార్యాలయం వద్ద పుంగనూరు డివిజన్ UTF నాయకులు సమావేశమై,
రాష్ట్ర UTF సంఘంపిలుపు మేరకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపు నివ్వడం జరిగింది. ఈ సందర్భంగా UTF రాష్ట్ర కార్యదర్శి రఘుపతి రెడ్డి,UTF నాయకులు జగన్మోహన్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,శంకర్ రెడ్డి,రెడ్డప్ప లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిదంగా ఉపాధ్యాయులపై నిర్బందాలు, బోధనేతర కార్యక్రమాలు ఎక్కువై, అరెస్టులు,హక్కులపై పోరాటాలు చేసే వారిని దోషుల్లా చూస్తూ , ఇచ్చినహామీలు అమలుచెయ్యమని అడిగితే నోటీసులు ఇవ్వడం, బైండ్ ఓవర్ కేసులు విధించడం వంటివి చేస్తూఉపాధ్యాయులను ఉగ్రవాదులను హింసించినట్లుగా భయబ్రాంతులుకు గురిచేస్తూ, ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఉత్తమ ఉపాధ్యాయుల పేరిట ఒక శాలువా కప్పి చేతులు దులుపుకోవడం బాధాకరమని,అందుకు నిరసనగా రాష్ట్ర UTFశాఖ పిలుపు మేరకు గురుపూజోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో UTFనాయకులు రమణ,ఆంజప్ప,చంద్రశేఖర్ రెడ్డి,కృష్ణంరాజు,విజయ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Tags: Boycott of Gurupujotsava programs in Punganur

