ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై బహిష్కరణ వేటు

Boycott of MLC Yadav Reddy

Boycott of MLC Yadav Reddy

Date:23/11/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
 పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. మరోవైపు యాదవరెడ్డి శుక్రవారం యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇటీవలే పార్టీ నుంచి వైదొలిగిన ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి సైతం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.బహిష్కరణ వేటుపై యాదవరెడ్డి స్పందించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకూ పాల్పడలేదన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించారనే విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి తాఖీదులూ అందలేదని చెప్పారు. నోటీసులు అందాక కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. తెరాసలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. కేవలం ఒకరిద్దరు చేతుల్లోనే పార్టీ నడుస్తోందని ఆరోపించారు.
Tags:Boycott of MLC Yadav Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *