Natyam ad

మంథనిలో ఘనంగా బీపీ మండల్ జయంతి

మంథని ముచ్చట్లు:

బీసీల రిజర్వేషన్ పితామహుడు బిపి మండల్ జయంతి మహోత్సవాన్ని శుక్రవారం మంథని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంకు వద్ద గల బిపి మండల్ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంథని ఎంపీపీ కొండా శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత,సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లతో పాటు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు బీసీల రిజర్వేషన్ పితామహుడు బిపి మండల్ జయంతిని నిర్వహిస్తున్నామన్నారు.బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సమాజంలో తలఎత్తుకునేలా చేసిన ఘనత బీపీ మండల్‌కు దక్కుతుందని వారు పేర్కొన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జి, పార్లమెంట్ సభ్యుడు, సంఘసంస్కర్త బిందెశ్వర్ ప్రసాద్ మండల్  రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గా ఆనాడు

 

 

Post Midle

1990 ఆగష్టు 7వ తేదీన ఆయన ఇచ్చిన కమిషన్ నివేదిక ఆధారంగానే నాటి ప్రధాని విపి సింగ్ మండల్ కమీషన్ సిఫార్సులను అమలుచేస్తున్నామని ప్రకటించడం వలన ఈరోజు భారతదేశంలో దాదాపు 3,600 పైగా కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. ఆనాడు బీపీ మండల్ అంటేనే అగ్రకులాల నాయకులు భగ్గుమంటున్నా ఆయన వెనుకడుగు వేయకుండా భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి, చూపిన చొరవ, ఆయన తెగువ మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు వీకే రవి, శ్రీపతి బానయ్య, కుర్ర లింగయ్య, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కన్నవేన శ్రీనివాస్ యాదవ్, నాయకులు కొట్టే రమేష్, బత్తుల సత్యనారాయణ, నక్క శంకర్, బెజ్జంకి డిగంబర్, ఇర్ఫాన్, ఆసిఫ్, ఎస్ కే యాకూబ్, పోలు కనకరాజు లతో పాటు పలువురు పాల్గొన్నారు.

 

Tags: BP Mandal Jayanti is celebrated in Manthani

Post Midle