బిఆర్‌ అంబేద్కర్‌కు ఘన నివాళులు

BR Ambedkar is a great honor

BR Ambedkar is a great honor

Date:26/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

భారత రాజ్యాంగ నిర్మాణకమిటి చైర్మన్‌ బిఆర్‌.అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. సోమవారం రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత సంఘ నాయకుడు , న్యాయవాది రెడ్డెప్ప , ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మిద్దింటి వెంకటస్వామి , ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి కలసి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అంబేద్కర్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు నాగరాజ, క్రిష్ణప్ప, రామలింగప్ప, శ్రీరాములు, న్యాయవాది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలి

Tags: BR Ambedkar is a great honor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *