Natyam ad

ఒకేసారి పూసిన బ్రహ్మకమలాలు

రాజమండ్రి ముచ్చట్లు:
 
బిక్కవోలులో బ్రహ్మకమలం ఒక్క పువ్వు పూసిందటేనే జనం ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక్క బ్రహ్మకమలం మొక్కకి పదుల సంఖ్యలో పువ్వులు పూయడం నిజంగా అద్భుతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో జువ్వలదొడ్డి లోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకి 80 పువ్వులు పూశాయి. ఇన్ని పువ్వులు ఒకేసారి పూయడంపై ఇంటి యాజమాని సత్యనారాయణ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి 80 పూసిన శివునికి ప్రీతిపాత్రమైన ఈ బ్రహ్మకమలాలను చూసేందుకు పరిసర ప్రాంతాల వారు ఆసక్తి చూపారు. హిమాలయాల్లో దొరికే ఈమొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Brahmakamalas painted at once