బ్రాహ్మణ కార్పోరేషన్‌ నారావారి కానుక – జిల్లా సమన్వయకర్త మధుకుమార్‌శర్మ

Brahmana Corporation Naraari's gift - district coordinator Madhukumararmha

Brahmana Corporation Naraari's gift - district coordinator Madhukumararmha

Date:20/02/2018

చిత్తూరు ముచ్చట్లు:

రాష్ట్రంలోని బ్రాహ్మణులందరిని అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి, చైర్మన్‌గా ఆనందసూర్యను నియమించి, బ్రాహ్మణులకు కానుకగా ఇచ్చారని జిల్లా సమన్వయకర్త మధుకుమార్‌శర్మ అన్నారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి అన్ని స్కీముల ద్వారా సహాయం అందించి, అభివృద్ధి చేసుకునేందుకు 8 నెలల కాలంలోనే ఆనందసూర్య వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. పెండింగ్‌లో ఉన్న చాణిక్యపథకం ద్వారా లబ్ధిదారులందరికి సబ్సిడి నిధులు మంజూరు చేసిన ఘనత చైర్మన్‌ ఆనందసూర్యకు దక్కిందన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి సహించలేని కొంత మంది విమర్శలు చేయడం వారి కుటిలస్వభావానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర మంత్రి యనమల రామక్రిష్ణుడు కూడ ఆనందసూర్య పనితీరు బాగుందని ప్రశంసించడం గమనార్హం అన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, బ్రాహ్మణ కార్పోరేషన్‌ పనితీరును రుజువు చేస్తామన్నారు. రాబోవు ఎన్నికల్లో ఆనందసూర్య నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బ్రాహ్మణులు మద్దతునిచ్చి, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును ఎన్నుకునేందుకు బ్రాహ్మణులందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ కుటుంభాల అభివృద్ధికి ఏ ప్రభుత్వము ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టలేదని మధుకుమార్‌శర్మ తెలిపారు. బ్రాహ్మణుల ఆశీర్వదం తెలుగుదేశం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అందించాలని కోరారు.

Tags: Brahmana Corporation Naraari’s gift – district coordinator Madhukumararmha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *