వేద ఘోష తో తుంగభద్ర నది తీరం లో అలరించిన బ్రహ్మణ కార్తీక వన భోజనాలు

కర్నూలు  ముచ్చట్లు:

 

స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఉదయం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి వార్లకు విశేషం

గా పంచామృత అభిషేకం అర్చన అనంతరం, ధాత్రి పూజలు నిర్వహించారు. మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమం లు నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణ గా అఖిల భారతీయ బ్రాహ్మణ

కరివేన నిత్యాన్నదాన సత్రం వారిచే నిర్వహించబచున్న శంకర వేద విద్యాలయం విద్యార్థులచే చతుర్వేద స్వస్తి అహుతులను ఆకట్టుకొన్నది. ఈ కార్యక్రమం లో 2000 మంది బ్రాహ్మణ సభ్యులు

పాల్గొన్నారని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం

సమాఖ్య రాష్ట్ర కోశాధికారి హెచ్ కె మనోహర రావు, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర, కరివేన సత్రం కార్యదర్శి Dr వేణుగోపాల్, కె వి సుబ్బారావు ,తాళ్లపాక నటరాజ్, ఇస్కాల సురేష్

కుమార్, మాధవప్రభు,ప్రాణేష్,సముద్రాల శ్రీధర్, కే.జి. ప్రభాకర్, ఉమేష్, రామ మనోహర్, దేవి ప్రసాద్, పద్మనాభరావు, ఆదోని బ్రాహ్మణ సంఘం కార్యదర్శి దేసాయి చక్రి తదితరులు పాల్గొన్నారు.

Tags: Brahmana Kartika Vana meals entertained on the banks of Tungabhadra river with Veda Ghosha

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *