మదనపల్లెలో 31న బ్రాహ్మణ కార్పోరేషన్‌ సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

 

బ్రాహ్మణ క్రెడిట్‌ కార్పోరేషన్‌ 5వ వార్షికోత్సవ సమావేశం ఈనెల 31న మదనపల్లెలో నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు రామ్మూర్తి, మధుకుమార్‌, రామకృష్ణ తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ సమావేశం సోసైటి కాలనీలో గల శ్రీరామాలయంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, క్రెడిట్‌ సోసైటి కార్పోరేషన్‌ డైరెక్టర్‌ సాయికుమార్‌, మేనేజర్‌ సుబ్రమణ్యంలు హాజరౌతున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ కుటుంబ సభ్యులు తప్పక హాజరై, కార్పోరేషన్‌ను బలోపేతం చేసి, సభను జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: Brahmin Corporation meeting on 31st at Madanapalle

Leave A Reply

Your email address will not be published.