Natyam ad

15న బ్రాహ్మణ కార్తీక భోజనాలు

పుంగనూరు ముచ్చట్లు:

కార్తీకమాసంను పురస్కరించుకుని ఈనెల 15న జిల్లా పురోహిత సంఘ అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో బ్రాహ్మణులచే కార్తీకమాసపు పూజలు, వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు పురోహిత సంఘ గౌరవ సలహాదారు కాసలనాటి రామ్మూర్తి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మదనపల్లె సమీపంలోని తవళం గ్రామంలో శ్రీనేలమల్లేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేక పూజలు, హ్గమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాప్రధాన కార్యదర్శి సంజీవ్‌ పవన్‌కుమార్‌తో పాటు బ్రాహ్మణ పెద్దలు హాజరౌతున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్. రాజశేఖర్,  మాధుకుమార్ శర్మ, అర్. రామకృష్ణ, ఆశ్వర్త, కె.ఎస్. గిరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Brahmin Kartika meals on 15th

Post Midle

Leave A Reply

Your email address will not be published.