Natyam ad

12న బ్రాహ్మణ వివాహా పరిచయ వేదిక 

పుంగనూరు ముచ్చట్లు:

బ్రాహ్మణ వధువరుల పరిచయ వేదిక కార్యక్రమం ఈనెల 12న తిరుపతిలోని బైరాగిపట్టెడలో గల  శ్రీవైశాఖన ఆశ్రమకళ్యాణ మండపంలో జరుపుతున్నట్లు బ్రాహ్మణ సంఘ కార్యదర్శి రామ్మూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలోని భీమాస్‌బాలాజి , కొత్తపల్లె ఆజయ్‌కుమార్‌, ప్రభాకర్‌ , ఓబి రామశర్మ, బేదం హరిప్రసాద్‌, డాక్టర్‌ చక్రవర్తి రాఘవన్‌, డాక్టర్‌ ఎన్‌.నరసింహాచార్యల ఆధ్వర్యంలో పరిచయ వేదిక జరుగుతోందన్నారు. వధువరులు తమ పేర్లను నమోదు చేసుకుని , పరిచయ వేదికకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు : 9390427018, 6302136315 లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు మధుకుమార్‌శర్మ, రామకృష్ణశర్మ, అశ్వర్థనారాయణ, కృష్ణమూర్తిరావు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Brahmin marriage introduction platform on 12th

 

Post Midle