Date:04/06/2019
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీ హరిహర శంకర మఠంలో ఈనెల 9న ఆదివారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు సూర్యనారాయణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణుల స్మశానవాటిక, కమ్యూనిటి భవనం నిర్మాణాలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కులస్తులు విధిగా హాజరుకావాలని కోరారు.
చెరువుకట్టపై వంతెనకు మరమ్మతులు చేయండి
Tags: Brahmin welfare service committee election on 9th