Brahmin woman gets financial assistance of Rs 2 lakh

బ్రాహ్మణ మహిళకు రూ.2లక్షలు ఆర్థిక సహాయం

Date:06/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో నివాసం ఉన్న బ్రాహ్మణ మహిళ సుధారాణికి రూ.2 లక్షలు బాండ్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ అందజేశారు. బుధవారం కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు బ్రాహ్మణులు , ఇతర మిత్ర బృందం కలసి గత నెలలో మృతి చెందిన యువ అర్చకుడు రాంప్రసాద్‌ సతీమణికి విరాళాలుగా వచ్చిన డబ్బును ఫిక్సెడ్‌ డిపాజిట్‌ బాండ్లు అందజేశారు. అలాగే మంత్రి సూచనల మేరకు ఆ కుటుంభానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ , సంఘ ప్రతినిధులు ఆర్‌వో రామకృష్ణ, రామమూర్తి, మధుకుమార్‌శర్మ, డాక్టర్‌ రమణరావు,ఆర్‌కె. రామకృష్ణ, కృష్ణమూర్తి, గిరిధర్‌, అశ్వర్థ తదితరులు పాల్గొన్నారు.

సెల్ఫ్ క్వారంటైన్ లో టీడీపీ

Tags: Brahmin woman gets financial assistance of Rs 2 lakh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *