Natyam ad

బ్రాహ్మణులు సమాజం లో  గౌరవ ప్రదమైన స్థానంలో  ఉన్నారు.

-శాసనసభ్యులు, టీటీడీ చైర్మన్    భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో  కంచిమఠంలో  ఆదివారం నిర్వహించిన షష్ఠి పూర్తి, వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ  సందర్బంగా     కరుణాకర రెడ్డి మాట్లాడుతూ,బ్రాహ్మణులు ఆర్థికంగా బలంగా లేక పోయినా సాంప్రదాయాలను కాపాడుతూ ఉన్నారన్నారు.  ఇలాంటివారు  చేస్తున్న కార్యక్రమాలకు అందరూ అండగా ఉండాలన్నారు. మానవ విలువలు తగ్గుతున్న నేటి రోజుల్లో  బ్రాహ్మణ ఆచార సంప్రదాయాలను కాపాడేందుకు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్ష్యులు   శేషగిరి రావు  ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.   రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్  వి కె రావు తో పాటు పలువురు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.షష్టి పూర్తి చేసుకుంటున్న జంటలను చైర్మన్ ఆశీర్వదించారు.

Tags: Brahmins occupy an honorable position in the society.

Post Midle