Date:24/11/2020
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. మరో దీవిలో ఉన్న టార్గెట్‌ను ఆ మిస్సైల్ ధ్వంసం చేసింది. ల్యాండ్ అటాక్ వర్షన్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించినట్లు తాజాగా వెల్లడైంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉన్నది. సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను ఇవాళ ఉదయం 10 గంటలకు పరీక్షించారు. అత్యంత విజయవంతంగా టార్గెట్‌ను ఆ క్షిపణి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ ఆర్మీ నేతృత్వంలో ఆ పరీక్ష జరిగింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మిస్సైల్ వ్యవస్థను ఆర్మీ వినియోగిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి స్ట్రయిక్ రేంజ్‌ను 400 కిలోమీటర్లకు పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి
ఎట్టకేలకు వెనక్కి తగ్గిన డోనాల్డ్ ట్రంప్
Tags:BrahMos missile test in the Andaman and Nicobar Islands