చక్రస్నానంతో ముగిసిన నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి ముచ్చట్లు:

 

నారాయ‌ణవ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా చ‌క్ర‌స్నానం నిర్వ‌హించారు.ఉద‌యం 9.30 నుండి 10.30 గ‌టంల వ‌ర‌కు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, ప‌సుపు, చందనల‌తో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.కాగా రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  పార్వ‌తి, ఏఈవో  దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌  స‌త్రేనాయ‌క్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌  నాగ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Brahmotsavalu of Narayana Kalyanam Sri Kalyana Venkateswaraswamy which ends with Chakrasnanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *