ధ్వజారోహణంతో ప్రారంభమైన  శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి ముచ్చట్లు:
అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు. జూన్ 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయి.   శ‌నివారం ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మ‌ధ్య‌ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గరుడ చిత్ర పటాన్ని ధ్వజస్తంభం మీద ఎగురవేశారు.   బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు  ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Brahmotsavalu of Sri Prasanna Venkateswaraswamy which started with flag hoisting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *