ఫిబ్రవరి 11 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
– పోస్టర్లు, బుక్‌లెట్లు ఆవిష్కరించిన జేఈవో వీరబ్రహ్మం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్లను జేఈవో
వీరబ్రహ్మం గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 11 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా, రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 15న రాత్రి గరుడ వాహనము, ఫిబ్రవరి 16న సాయంత్రం 4 గంటలకు బంగారు రథం, ఫిబ్రవరి 18న రథోత్సవం, ఫిబ్రవరి 19న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tags: Brahmotsavam of Sri Kalyana Venkateswara from February 11
