The annual Brahmots will be held at the Sri Kapil

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Date:20/01/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుంచి 23వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                   ఉదయం సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం) ధ్వజారోహణం(కుంభలగ్నం)       హంస వాహనం

15-02-2020(శ‌నివారం)         సూర్యప్రభ వాహనం      చంద్రప్రభ వాహనం

16-02-2020(ఆదివారం) భూత వాహనం           సింహ వాహనం

17-02-2020(సోమ‌వారం) మకర వాహనం         శేష వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం

19-02-2020(బుధ‌వారం) వ్యాఘ్ర వాహనం         గజ వాహనం

20-02-2020(గురువారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం

21-02-2020(శుక్ర‌వారం)    రథోత్సవం(భోగితేరు)           నందివాహనం

22-02-2020(శ‌నివారం)       పురుషామృగవాహనం                     కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం

23-02-2020(ఆదివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం.          ధ్వజావరోహణం.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 12వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా బుధ‌వారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

23లోపు కులగణనపై అభ్యంతరాలు తెలపండి

Tags: Brahmotsavas of Sri Kapileswaraswamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *