Brahmotsavas of Sri Venkateswaraswamy in Thondamanadu

తొండ‌మనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Date:22/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడికి అనుబంధంగా ఉన్న‌ తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌య వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 23 నుండి మార్చి 2వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం శ‌నివారం సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తిరోజూ ఉద‌యం స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి.

కాగా, ఫిబ్ర‌వ‌రి 27న‌ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 3వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరుగనుంది. ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

23-02-2020(ఆదివారం) ధ్వజారోహణం శేష వాహనం

24-02-2020(సోమ‌వారం) ——- హంస వాహనం

25-02-2020(మంగ‌ళ‌వారం) ——– సింహ వాహనం

26-02-2020(బుధ‌వారం) ——- హ‌నుమంత‌వాహ‌నం

27-02-2020(గురువారం) ——– క‌ళ్యాణోత్స‌వం, గ‌రుడ‌వాహ‌నం

28-02-2020(శుక్ర‌వారం) ——- గజ వాహనం

29-02-2020(శ‌నివారం) ——- చంద్రప్రభ వాహనం

01-03-2020(ఆదివారం) తిరుచ్చి ఉత్స‌వం అశ్వ‌వాహనం

02-03-2020(సోమ‌వారం) చ‌క్ర‌స్నానం ధ్వజావరోహణం.

పురుషామృగ వాహనంపై పరమేశ్వరుడి అభయం

Tags: Brahmotsavas of Sri Venkateswaraswamy in Thondamanadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *