బ్రెయిన్ బ్రిడ్జ్ – హెడ్ ట్రాన్స్ ప్లాంట్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఈ విషయాన్ని నేను మొదటిసారి వింటున్నాను.ఏకంగా మనిషి తల మార్పిడి చేయడం..రెండవది మనిషి ముఖాన్ని మార్చడం..రాబోయే ఆరు నుండి పది సంవత్సరాల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఏకంగా మనిషి ముఖాన్ని మార్చడంమనిషి యొక్క తలను మార్చడం లాంటి ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకొని వస్తామని ఒక సంస్థ అధికారికంగా ప్రకటించింది.

 

ఉదాహరణకు పక్షవాతం వచ్చిన మనుషులు, అల్జీమర్స్ లేదా శరీరం యాక్సిడెంట్ అయ్యి పూర్తిస్థాయిలో పనిచేయని వారికి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి శరీరము మరియు మార్పిడి చేయదలచుకున్న వ్యక్తి యొక్క శరీరాన్ని రెండింటినీ పక్క పక్క ఆపరేషన్ టేబుల్ ల పైన పడుకోబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ ఆపరేషన్ చేసి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తలను తీసి పక్కకు పెట్టి తల మార్పిడి చేయవలసిన వ్యక్తి యొక్క తలను తీసి ఆ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరానికి అతికిస్తుంది. ఆ శరీరం పైన ఎలాంటి కుట్లు గాయాలు లాంటివి లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో అతికిస్తుంది.ప్రస్తుతానికి వినడానికి మనకైతే కాస్త వింతగా ఆశ్చర్యంగా ఉన్న భవిష్యత్తు కాలంలో ఇది ఒక సాధారణ విషయం లాగా కనిపించే అవకాశం ఉన్నది.

 

Tags:Brain Bridge – Head Trans Plant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *