యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు రద్దు
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
బుధవారం నాడు యాదగిరిగుట్ట కి సీఎం కేసీఆర్ తో పాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానుండడంతో పోలీసులు, అధికారులు ఏర్పాట్లను పూర్తి చేసారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ కు వెళ్లే ముందు ఢిల్లీ, పంజాబ్,కేరళ సీఎం లతో నరసింహ స్వామి ని సీఎం కేసీఆ దర్శించుకోనున్నారు. మూడు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయానికి రానుండటంతో భద్రత కారణాల దృష్ట్యా రేపు ఆలయంలో నిర్వహించే ఆర్జిత కళ్యాణానికి భక్తులకు అనుమతి ఇవ్వడంలేదు. ఆర్జిత కళ్యాణం అంతరంగికంగా నిర్వహించనున్నట్టు ఆలమ ఈవొ వెల్లడించారు. అలాగే, ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు.
Tags: Brake darshans canceled in Yadadri

