చవితి పందిళ్లలో నేతల సందడి

Date:14/09/2018
ఖమ్మం ముచ్చట్లు
తెలంగాణలో ఎలక్షన్ హీట్ మొదలైపోయింది. పలువురు అభ్యర్ధులకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసేసింది. దీంతో వారంతా ఉత్సాహంలో మునిగిపోయారు. ఇక ప్రత్యర్ధి పార్టీలు సైతం కసరత్తు మొదలుపెట్టేశాయి. మొత్తంగా రాష్ట్రంలోఎన్నికల సందడి నెలకొంది. ఇదే టైమ్‌లో వినాయకత చవితి రావడంతో నేతల్లో మరింత జోష్ వచ్చేసింది. విఘ్నాలు తొలగించే వినాయకుడి చవితి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నారు.
దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడంతో పాటూ
ప్రజాభిమానమూ చూరగొనేందుకు పలువురు నేతలు వినాయక ప్రతిమలను ప్రతిష్టించేందుకు భారీగా విరాళాలు ఇచ్చినట్లు ఖమ్మం జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరికొందరైతే వేడుకల ఖర్చు తాము పెట్టుకుంటామంటూ ముందుకొచ్చారట. ఏదేమైనా పండుగ రోజుల్లో రాజకీయ నేతల హడావిడి అధికంగా ఉండొచ్చన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.
కొత్తగూడెం జిల్లాలోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. విఘ్నాలు తొలగించే వినాయకుడితోనే ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంప్రారంభించాలనుకుంటున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికోసం వినాయక చవితి పండుగనే వేదికగా మలచుకున్నారని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే ముందస్తు ఎన్నికల్లో విజయం కోసం గణనాథుడిని భక్తిశ్రద్ధలతోఆరాధించుకోనున్నారని చెప్తున్నారు. ఇదిలాఉంటే చవితి  వేడుకలకు సంబంధించిన ఖర్చులను మొత్తం తామే భరిస్తామంటూ కొందరు నేతలు ఉత్సవ సమితులకు హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు ఎంతమేర వాస్తవమో తెలీకున్నా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం చవితి వేడుకలు ఘనంగా సాగిపోతాయని అంతా భావిస్తున్నారు. 2017లో చవితి వేడుకలను పురుస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది గణపయ్య విగ్రహాలను ప్రతిష్టించారు. దాదాపు 5వేలకు పైగా విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ దఫా సైతం అదే జోష్ ఉండనుంది. కాకపోతే చిన్నవ్యత్యాసం. ఎన్నికల టైమ్ కావడంతో వేడుకల్లో రాజకీయ నేతలూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇదిలాఉంటే కొందరు తమ అభిమాన నేతలకు సపోర్ట్‌గానూ విగ్రహాలు ప్రతిష్టించి వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. తమ నాయకుడికిఅండగా నిలవాలని కోరుతూ ఉత్సవ సమితులను ఏర్పాటు చేసి మండపాలను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. ఖమ్మం నగరంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గతేడాది సుమారు 500 నుంచి 600 విగ్రహాలు కొలువుదీరగా ఈసారి ఆ సంఖ్య సుమారు 750 నుంచి 900 వరకు పెరిగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జీఎస్టీ, నోట్ల రద్దు మొదలైన కారణాల చేత వెనక్కి తగ్గుదామని అనుకున్న ఉత్సవ సమితులను సైతం నేతలే దగ్గర ఉండి మరీ మండపాలను ఏర్పాటు చేయిస్తున్నారని చెప్తున్నారు. దీంతో ఈ ఏడాది రెండు జిల్లాల్లో వెయ్యికి పైగా ఎక్కువ మండపాలు ఏర్పాటు కానున్నాయని అంటున్నారు.
దీంతో విగ్రహాల సంఖ్య 6వేలు దాటనుందని అంచనావేస్తున్నారు. చవితి వేడుకల తర్వాత దసరా నవరాత్రులు, దీపావళి వేడుకలు ఉంటాయి. వాటిలోనూ నేతలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ఆ సంబరాలకు ఇప్పట్నుంటే ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న టాక్ సైతం వినిపిస్తోంది.
Tags:Bravely knights in swaddling pigs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *