భళా…భారత్..భళా  

Date:29/03/2020

న్యూఢిల్లీముచ్చట్లు:

తక్కువ జనాభా కలిగిన యూరోపియన్ దేశాలు కరోనా మహమ్మారికి విలవిలలాడుతుంటే 130 కోట్ల అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఎదిరించి నిలబడుతుండంపై ప్రపంచ అగ్ర దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో “లాక్ డౌన్” వంటి ప్రక్రియ విజయవంతం కాదని, భారతీయులు సహకరించరని ఐక్యరాజ్యసమితి మరియు డబ్లూహెచ్ఓ వంటి సంస్థలు అంచనా వేసాయి .

 

కొంతమంది అంతర్జాతీయ ఎనలిస్టులైతే ఈ మహమ్మరి దెబ్బకు మురికివాడలు ఎక్కువగా ఉన్న భారత్ లో రానున్న రోజులలో ఎంతమంది చనిపోవచ్చునో లెక్కలు కూడా కట్టేశారు.
కానీ వీరందరి అంచనాలకు భిన్నంగా భారత్ లో లాక్ డౌన్ ఖచ్చితంగా అమలౌతుండంపై ఇతర దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

 

ఈ లాక్ డౌన్ యజ్ఞాన్ని 100% పటిష్టంగా ఏప్రిల్ 14 వరకూ కొనసాగితే ఈ మహమ్మరి నుండి భారత్ ఎదురొడ్డి నిలబడటం కష్టమేమీ కాదని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయులకు శుచి తక్కువని, శుభ్రత ఉండదని అసహ్యించుకుని ద్వేషించే విదేశీయులు సైతం
సామాజిక దూరం మరియు వ్యక్తిగత పరిశుభ్రత లను తు.చ తప్పకుండా పాటిస్తున్న భారతీయులను చూసి నివ్వెరపోతున్నారు.

 

 

“ఎక్కడ వారు అక్కడేఅక్కడే ఉందాం”
“సామాజిక దూరం పాటిద్దాం”
లాక్ డౌన్ విజయవంతం చేద్దాం
* భళా భారత్ భళా *

24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Tags: Bravo … bharatbhala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *