ట్రెజరీలో బిల్లుల చెల్లింపుకు బ్రేక్‍..!

Date:26/11/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

ట్రెజరీలో ముఖ్యమైన బిల్లుల చెల్లింపులకు కూడా బ్రేక్‍ పడింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన జిపిఎఫ్‍, మెడికల్‍ రీయింబర్స్మెంట్‍, లీవ్‍ ఎన్‍ క్యాష్మెంిటు బిల్లుల చెల్లింపులకు ట్రెజరీలో ఆమోద ముద్ర పడినా.. చెల్లింపులు జరగటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఎంప్లాయిస్‍ హెల్త్ కార్డు ఉన్నా కొన్ని జబ్బులకు ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటునాన్నారు. ఆరు నెలల్లోపు సంబందిత శాఖాదికారి ధృవీకరణతో మెడికల్‍ రీయింబర్స్మెంటు కోసం బిల్లులు సమర్పిస్తే.. ఆ బిల్లులకు వెంటనే చెల్లింపులు జరుగుతుండేవి. కానీ గత రెండు నెలలుగా ఆ చెల్లింపులు జరగటం లేదు. దీంతో ఉద్యోగులు వైద్యం కోసం మందులు కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరల్‍ ప్రావిడెంట్‍ ఫండ్‍ ఖాతాలో సాధారణంగా ప్రతినెలా పిఎఫ్‍ మొత్తం జమ అవుతోంది. ఉద్యోగులు తమ అవసరం నిమిత్తం అందులో కొంత తీసుకుని చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ఆ మొత్తంకోసం ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకుంటే.. వారికి నిరాశ ఎదురవుతుంది. రెండు నెలల నుండి చెల్లింపులు జరగటం లేదు. లీవ్‍ ఎన్క్యా ష్మంుట్‍ బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. జీతాల బిల్లులు ట్రెజరీకి చేరుకుంటున్నాయి. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావలసి యున్న భెనిపిట్స్, గ్రాట్యూటి, కమ్యుటేషన్, జిపిఎఫ్,మరియు ఇఎల్ఎస్ ఏవి కూడ యివ్వడం లేదుఅంతే కాకుండా రిటైర్ అయ్యి 8 నెలలకు, పెన్షన్ మంజూరీ లేదు, యింకనూ హెల్త్ కార్డులమిాద వైద్యం చేయించుకుంటే 6 నెలలనుండి మందులుకూడ యివ్వడంలేదుసిఎం మాత్రం రిటైర్ నాటికి అన్ని బెనిపిట్స్ క్లియర్ చేసిపెన్షన్ మంజూరి పేపరుతోగౌరవముగా, ప్రభుత్వ వహనములో ఇంటికి పంపాలని చెబుతున్నారు,

నివర్‌ వరద భీభత్సం

Tags; Break for payment of bills in the treasury ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *