లాభాల మార్కెట్లుకు బ్రేక్

The onset of ongoing stock markets

The onset of ongoing stock markets

Date:12/06/2019

ముంబై ముచ్చట్లు:

మూడు రోజుల వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్‌ బుధవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 193 పాయింట్ల నష్టంతో 39,757 పాయింట్ల వద్ద ముగసింది. ఇక నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,906 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయిన మార్కెట్ చివరకు కొంత రికవరీ అయ్యింది. ముడిచమురు ధరల తగ్గుదల కూడా మార్కెట్‌ను నష్టాల నుంచి బయటపడేయలేకపోయింది. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇకపోతే ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు, ఆటో రంగ షేర్లు బాగా పడిపోయాయి. మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.
మార్కెట్ హైలైట్స్..

 

 

 

 

✺ 1,022 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,462 షేర్లు నష్టపోయాయి. 164 షేర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
✺ నిఫ్టీ 50లో టాటా స్టీల్, గెయిల్, ఓఎన్‌జీసీ, వేదాంత, టీసీఎస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టాటా స్టీల్ దాదాపు 3 శాతం పెరిగింది.
✺ అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, హీరో మోటొకార్ప్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు 8 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మినహా మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు (1 శాతానికి పైగా) బాగా నష్టపోయాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ కూడా 2 శాతానికి పైగా పడిపోయింది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.44 శాతం తగ్గుదలతో 60.80 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.65 శాతం క్షీణతతో 51.85 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. 8 పైసలు పెరుగుదలతో 69.37 వద్ద ఉంది.

భారీగా పడిపోయిన బంగారం

Tags:Break for profit margins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *