పశుగణనకు బ్రేక్

Date:23/102018
కర్నూలు ముచ్చట్లు:
పాడిపరిశ్రమకు మద్దతుగా ఉండాలన్న ధ్యేయంతో ప్రభుత్వం పశుగణనను ప్రారంభించింది. పశువులను లెక్కించడం ద్వారా వాటిని పెంచుతున్నవారికి వివిధ ప్రయోజనాలు లభిస్తాయని భావించింది. అంతేకాక పశువుల సంఖ్యకు తగ్గట్లుగా విధానాలు రూపొందించుకుని ముందడుగేయాలని అనుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పశువుల కౌంటింగ్‌కు మాత్రం బ్రేక్ పడినట్లు కర్నూలువాసులు అంటున్నారు. సాంకేతిక సమస్యల వల్లే లెక్కింపు నిలిచిందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పశువుల జనాభాను లెక్కిస్తున్నారు. అక్టోబర్‌ 1నే లెక్కింపు చేపట్టారు. అయితే జిల్లాలో మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో ఈ కౌంటింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. 22రోజులు దాటినా అధికారులు పూర్తిస్థాయిలో సమస్యలను అధిగమించలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు.
పశువులకు సంబంధించిన సమగ్ర సమచారాన్ని పొందుపరచేందుకు ఓ యాప్ రూపొందించారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని సరిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో పశుగణన సమర్ధవంతంగా సాగడంలేదు. ఇప్పటికే పశుగణనపై వందల మంది ట్రైనింగ్ తీసుకున్నారు. సమాచారాన్ని ఏ విధంగా సేకరించి, నమోదు చేయాలో తెలుసుకున్నారు. అయితే యాప్‌తో సమస్య రావడంతో ఈ కార్యక్రమం సజావుగా సాగడంలేదు. వాస్తవానికి గతేడాదిలోనే పశుగణన నిర్వహించాలి. అయితే కొన్ని కారణాలతో వాయిదా వేసింది ప్రభుత్వం.
ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో కర్నూలు పాడిపశువుల పెంపకందారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. పశుగణనను ప్రతీ ఐదేళ్లకు నిర్వహిస్తారు. దేశంలోని పశువుల సంఖ్యను గుర్తించి కేంద్రప్రభుత్వం, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువులకు తగ్గట్లుగా రాష్ట్రప్రభుత్వాలు విధానాలు రూపొందించుకుంటాయి. ఏయే రకాల పశువులను ప్రజలు పెంచుతున్నారో తెలుసుకుని వాటి ఉత్పత్తిని అంచనా వేస్తారు.
ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, మేకలు, కోళ్లను గణించడం ద్వారా పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తులు ఎంతమేరకు ఉంటాయో గ్రహిస్తారు. ఈ ఉత్పత్తులు జనాభాకు తగ్గట్లుగా ఉన్నవీ లేనిదీ గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. ఇక పశువుల ఆరోగ్యానికి సంబంధించిన మందులు సైతం అందుబాటులో ఉంచేందుకు ఈ గణనన ఉపయోగపడుతుంది. వాటి సంరక్షణకే కాక మేత, దాణాలకు కొరత రాకుండా చూడొచ్చు. మొత్తంగా పశువుల సంరక్షణకు సంంధించి హాస్పిటల్స్, సంచార వైద్యశాలలు ఏర్పాటు కూడా చేయొచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే యాప్‌ సమస్యలు పరిష్కరించి పశుగణన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Break the cattle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *