Date:08/12/2019
తిరుమల ముచ్చట్లు:
టిటిడి నూతనంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)కు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ట్రస్టుకు విరాళాలందించడం ద్వారా ఆదివారం అధిక సంఖ్యలో 346 మంది బ్రేక్ దర్శనం చేసుకోవడం విశేషం. ఇప్పటివరకు దర్శించుకున్న వారిలో ఈ సంఖ్యే అధికం. అక్టోబరు 21 నుండి ఈ ట్రస్టును బ్రేక్ దర్శనాలకు అనుసంధానం చేశారు. నవంబరు 4వ తేదీ నుండి ఆన్లైన్ కోటాను ప్రారంభించారు. ఆదివారం దర్శించుకున్న వారిలో ఆఫ్లైన్లో విరాళం ఇచ్చినవారు 147 మంది, ఆన్లైన్లో విరాళమిచ్చిన వారు 199 మంది ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
Tags:Breakthrough of 346 people by Srivani Trust